హైదరాబాద్: మావోయిస్ట్ పార్టీకి చెందిన 130 మంది నక్సలైట్లు తుపాకులతో సహా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో శనివారం ప్రభుత్వానికి లొంగిపోయారు. లొంగిపోయిన నక్సల్స్ మొత్తం 124 ఆయుధాలను అప్పగించారు. జనజీవన స్రవంతిలో కలిసిన నక్సల్స్ లో పీఎల్జీఏ బెటాలియన్ కాయ్-1, కాయ్-2 కమాండర్లు ఎంద్రి కలిత్రామ్ అలియాస్ ఉయికె కల్లు, కొర్సా లక్కు, చలసాని నవత అలియాస్ చంద్ర, ఇతర ముఖ్య నేతలు ఇర్పా రాము అలియాస్ వినోద్ తదితరులు ఉన్నారు.
లొంగిపోయిన నక్సల్స్ అప్పగించిన 124 ఆయుధాల్లో ఒక ఇన్సాస్ ఎల్ఎంజీ రైఫిల్, 31 ఏకే-47 రైఫిల్స్, 21 ఇన్సాస్ రైఫిల్స్, 20 ఎస్ఎల్ఆర్ తుపాకులు, ఒక బోల్ట్ యాక్షన్, పద్దెనిమిది .303 రైఫిల్స్, ఒక 9ఎంఎం కార్బైన్, రెండు 9ఎంఎం పిస్టల్స్, మరో యూఎస్ కార్బైన్, రెండు 8ఎంఎం బోల్ట్ యాక్షన్ రైఫిల్స్, ఒక 7.62 ఫాల్ రైఫిల్, 18 సింగిల్ షాట్ గన్స్, రెండు బీజీఎల్, ఒక స్టెన్ కార్బైన్, నాలుగు ఎయిర్ గన్లు ఉన్నాయి. ఇవిగాక 222 మాగ్జిన్లు, 5,205 తుపాకీ తూటాలను కూడా నక్సలైట్లు పోలీసులకు అప్పగించారు.

సీఎం రేవంత్ రెడ్డి ఎదుట ప్రభుత్వానికి లొంగిపోయిన 130 మంది మావోయిస్టుల్లో 125 మంది ఛత్తీస్ గఢ్ కు చెందినవారు కాగా, ఐదుగురు తెలంగాణాకు చెందినవారు. కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ విజయ్ కుమార్, ఎష్ఐబీ ఐజీ బి. సుమతి తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
లొంగిపోయిన మావోయిస్టుల పూర్తి వివరాలు దిగువన గల పీడీఎఫ్ ఫైల్ లో చూడవచ్చు:

