Top 5 This Week

Related Posts

కోవిడ్ ఆసుపత్రిలో మంటలు: 13 మంది మృతి

మహారాష్ట్రలోని కోవిడ్ ఆసుపత్రిలో కొద్దిసేపటి క్రితం ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. పాల్ఘర్ జిల్లా వాసాయిలోని విజయ్ వల్లభ్ ఆసుపత్రి ఐసీయూ విభాగంలో అగ్నిప్రమాదం కారణంగా మంటలు చెలరేగి 13 మంది రోగులు మరణించారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఐసీయూలో 17 మంది రోగులు ఉన్నట్లు సమాచారం. ఇదే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మిగతా రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు. నాసిక్ లోని కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరాలో లోపం వల్ల ఇటీవలే 24 మంది రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను మరువకముందే మరో విషాదం చోటు చేసుకుంది.

Popular Articles