నల్లగొండ: రెవెన్యూ శాఖకు చెందిన అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది. నల్లగొండ జిల్లా చిట్యాల తహశీల్దార్ గుగులోత్ కృష్ణ రూ. 2.00 లక్షల మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు గురువారం చిక్కాడు. ఏసీబీ మహబూబ్ నగర్ డీఎస్పీ, నల్లగొండ జిల్లా ఇంఛార్జి డీఎస్పీ సిహెచ్ బాలకృష్ణ కథనం ప్రకారం.. గుండ్రాంపల్లిలోని సర్వే నెం. 172లో గల వ్యవసాయ భూమిని మ్యుటేషన్ చేయడానికి, సర్వే నెం. 167లో తనిఖీ చేసేందుకు రూ. 10.00 లక్షల మొత్తాన్ని తహశీల్దార్ కృష్ణ లంచంగా డిమాండ్ చేశాడు. అయితే రూ. 5.00 లక్షలకు బేరం కుదుర్చుకుని, గురువారం రూ. 2.00 లక్షల మొత్తాన్ని కంప్యూటర్ ఆపరేటర్ రమేష్ ద్వారా తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ చెప్పారు. తహశీల్దార్ కృష్ణతోపాటు ఆపరేటర్ రమేష్ ను అరెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు.
ఏసీబీ వలలో ‘రెవెన్యూ’ తిమింగలం
